ఓ నవ లోకం...
పిలుస్తోంది... పదా...
ఆ లోకం లో నువ్వు నేనే...
మనకు తోడుగా వెన్నెల...
పగలన్నదే లేని లోకం
ఋతువులుమారవు ,
కాలం కదలదు,
ఆకలిదప్పులు ఉండవు....
నా వాళ్ళు పిలుస్తారని నేను
నీ వాళ్ళు పిలుస్తారని నువ్వు
పడే ఆరాటాలు ,ఉరుకులపరుగులు ,
వీడి వెళ్లలేక.... చెప్పుకొనే వీడుకోల్లు
వెళ్లి ఉండలేక... పడే వేదనలు...
ఏవి మనల్ని బాధించవు.
పదా.... వెళ్దాం...
ఏ అడ్డంకులు లేని ప్రణయ సామ్రాజ్యాన్ని నిర్మించుకుందాం.
నరేష్ ....
No comments:
Post a Comment