Monday, 16 April 2012

గీతాలు





మూడ్ బాలేనప్పుడు గిసాడేమో బ్రహ్మ
అన్నీ అసంపూర్తి గీతలే నావి
బుడి బుడి అడుగుల గీతలను
శాశ్వతంగా చెరిపేసింది విధి రాత
వేలు పట్టి గీతలను గీయడం నేర్పాల్సిన నాన్న
రక్తపు గీతను తెంచుకొని వెళ్లి పోతే
అమ్మే నాన్నై బరువు బాధ్యతల గీతలను మోస్తూ ఉంటె
ఆ... ఐదేళ్ళ ప్రాయంలోనే నేర్చుకున్న కష్టాల గీతలు ఎలా దాటాలో...
నేను గీసే ప్రతి గీత వంకర అవుతున్నప్పుడల్లా..
మొండితనం గీత నన్ను పెనవేసుకుంది
బ్రతుకు బండిని లాగడానికి
అక్షరాల గీతాలు గీసా..
జ్ఞాన జ్యోతి వెలిగింది
పుస్తకాలతో చెలిమి చేశా
అజ్ఞానపు గీత తొలిగింది
వ్యక్తులతో జత కూడా
మంచి - చెడుల వ్యత్యాసపు గీత తెలిసింది
అలా.. తెలుసుకుంటూనే
ఓ కల్కినై నన్ను నేను మలుచుకుంటూ..
భవిష్యత్తు కిరణాల వెంటా
సమాంతర రేఖనై సాగాలనుకుంటా...
కానీ ,
వయసు వేదనో
ఒంటరితనపు రోదనో
ఏవో.. నాలో నిండి ఉన్న
ఆ అసంపూర్తి గీతలేవో..
నా దారికి నిత్యం అడ్డుపడుతూనే... ఉంటాయి.
ఇప్పటికి తెలియ రాలేదు
వాటిని ఎలా పూర్తి చేయాలో ?
నన్ను ఎలా పూరించుకోవాలో..??

No comments: