Monday, 16 April 2012

నేనేంటో......?





నిదుర రాని రేయిలో
పురుడు పోసుకున్న వేదనలు
ఎవరు చూసారు గనుక....
జారుతున్న కన్నీటిలో
రేపటి స్వప్నాలు ఉన్నాయని
ఎవరికీ తెలుసు గనుక...
చిరునవ్వుల వెనుక
రాసుకుంటున్న మంటల వేడి
ఎవరిని తాకింది గనుక....
నేనేంటో...........తెలియడానికి.

No comments: