అలసి పోయాను నేను
ఈ జీవన పోరాటంలో
మిగిలి పోయాను నేను
ఈ విశాల ప్రపంచంలో
ఆశయం, ఆవేశం
లక్ష్యం, గమ్యం
పరుగులే తీశాను
చెదిరే మేఘం లా
మారని చిత్రంలా
అందరిలా నాలోను
ఏదో సాధిచాలన్న తపన
ఏదో శోధించాలన్న వేదన
అలసి పోయాను నేను
ఈ జీవన పోరాటంలో
మిగిలి పోయాను నేను
ఈ విశాల ప్రపంచంలో
అశాంతి,అసంతృప్తి
అవమానం,అవహేణన
నరనరాలలో ప్రవహించి
అమిత వేగంతో పరావర్తించి
కాంతి వేగంతో దూసుకువచ్చి
మా మనసుని భళ్ళు మనిపించింది
దిక్కు తోచక, మాట రాక
గుండె పగిలి, గొల్లుమన్నాను
అలసి పోయాను నేను
ఈ జీవన పోరాటంలో
మిగిలి పోయాను నేను
ఈ విశాల ప్రపంచంలో!!!!!
No comments:
Post a Comment