Monday, 16 April 2012

చివరి కన్నీటి బొట్లు





ఎక్కడ నిన్ను మరుస్తానో అని
నా గుండె లయలో ,నా శ్వాసలో బంధించేసాను.
ఈ అడ్డంకులు అన్నిటిని తోసేస్తూ...
నిన్ను చేరుకోవాలని...
నిరంతర మర్గాన్వేశినై నేనుంటే...
మరి,
ఈ చేదునిజమేంటి
స్వప్నమై నిలిచింది...!
నా శ్వాస ,నా గుండె లయ
ఎప్పటికి....నావి కావా....?!!
కాలేవా.....??!
మరి దేనికోసమో నా ఆరాటం తెలియక
నడిరాతిరి మొదలైన కన్నీటి జల్లు
తెలవారే దాకా.... కురుస్తూనే ఉంది.
చివరిగా..రెండు కన్నీటి బొట్లు
"ఎందుకే తనకోసం తాపత్రయపడి
మమ్మల్ని చేజార్చుకొంటావు...?" అంటూ...
నేలరాలాయి....
ఎప్పటికి...జవాబు లేని ప్రశ్న
నాలాగే....!!!

                       నరేష్ ....
       

No comments: