Monday, 16 April 2012

ప్రత్యామ్నయం......





గుండెను వేయి ముక్కలు చేయగల పదును
కత్తికి ఉందో లేదో తెలియదు కానీ,
ప్రేమకు మాత్రం ఆ పదును ఉంది.
రక్తం చిందించకుండా...
అది చేసే గాయం ఎలాంటిదంటే....
ప్రపంచంలో ఉన్న ఏ మందులు దాన్ని మాన్పలేవు.
అసలెందుకు....?
మనసు ప్రేమను ఇంతగా....ప్రేమిస్తుంది.
లోకంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉన్నప్పుడు
ప్రేమను పోలిన ప్రేమే లేదా...?
దానికి ప్రత్యమ్నయమే లేదా....?

No comments: