ఈ సూర్యరశ్మి నా శరీరాన్ని చైతన్యం చేసినట్టే;
ఏదో శక్తి నా మనసుని చైతన్యం చేయకూడదా....
నీ నీలి నీడలు దాటి
గట్టిగా...ఉపిరి పీల్చి,
నా దైనందిక జీవితంలో కలసిపోతాను.
ఎన్నాళిలా ? ఈ మౌన ముద్రలో...
నన్ను నేను మరచి నీ తలపులతో క్షీణించను.
నిన్ను మరవడం అంటే
నన్ను మరవడమే అయినప్పుడు
ఏం చేయను? నాకు ఇంకో దారే తెలియడం లేదు.
No comments:
Post a Comment