Monday, 2 July 2012

ఖాళీ గా ఉంది నా మనసు

ఖాళీ గా ఉంది నా మనసు దోసిలి ................
అందులో ఆనందం చేరితే అందరికీ పంచుతాను!!!

కోపం కుదురుకుంటే వేళ్ళ సందుల్లోంచి వదిలేస్తాను... 
శాంతి పావురం వచ్చి వాలితే స్వేచ్చగా ఎగరేస్తాను !!!

ఆవేశం వచ్చి పలకరిస్తే ఆగనీయక పంపేస్తాను ...
ఈర్ష్యా ద్వేషాలు కుదురుకుంటే తన్ని తరిమేస్తాను !!!

ప్రేమ వర్షం కురిస్తే ఆనకట్టలు కట్టి నింపుకుంటాను...
దయ కరుణ నిల్వ చేసేందుకు అక్షయపాత్ర అవుతాను!!!

త్యాగం చిరుగాలిలా తాకితే చిన్నికొమ్మలా ఊగుతాను...
మంచితనపు మల్లెలు నింపుకుని ప్రపంచమంతా వెదజల్లుతాను!!!

1 comment:

Anonymous said...

this is my poetry.pls delete it from your blog -bhavani