Saturday, 21 July 2012
అనురాగం
అనురాగం,అనుబంధం,ఆప్యాయత
సంకేతలకు కొరతలేని ఆత్మీయ నిలయం
చాలీ చాలని మా ఈ మధ్య తరగతి జీవితం....
బాధ కలిగితే ఏడవకు "కన్న" అంటూ ధైర్యం చెబుతూ
తన చల్లని చేతులతో గోరుముద్దలు తినిపించే "అమ్మ"......
అవమానం ఎదురైతే "నేనున్నాని" అంటూ ఓదార్పునిస్తూ
... స్నేహితుడిగా తోడుండే "నాన్న"......బ్రతుకు నరకమై
కన్నీలు చూపగా గెలుపు నీడలా వెన్నంటుండే ''అన్నయ్య"......
మనసులో కొండంత భారం ఉన్న, ప్రతిక్షణం,....
చిరు నవ్వులతో అల్లరిచేస్తూ ప్రేమ పాశంతో మమకారం
కురిపించే బోసి నవ్వుల మనస్తత్వం కలిగిన "చెల్లెమ్మ"......
డబ్బులున్నా మనసు-మనసు కలవలేని "దూరం "......
అంతస్తులున్నా మనష్ శాంతిగా నిదురించలేని 'భారం"......
హోదాలువున్నా సంతోషం పొందలేని "కల్మషం".......
దగ్గరవున్నా మాట-మాట పంచుకోలేని ''మౌనం''......
ఎన్ని ఉన్నా ఏముంది "ధనవంతులకు" ఐశ్వర్యం తప్ప.....!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment