Monday, 30 July 2012
ఎంత పిచ్చింది నా మనసు..
ఎపుడూ ఎదో ఆలోచిస్తూ..అపుడపుడు
ఎదుటవారి ఆలోచనలలోకి చూస్తూ..
తనని కలసిన మనుషులని విశ్లేషిస్తూ,
తనని పిలిచిన మనసులను ఆక్షేపిస్తూ...
ఎంత పిచ్చి మనసు నాది..
అంతులేని వ్యధనైనా..
అసంపూర్తి కధనైనా..
ఒక్కోక్షణం ఒంటరిగా..
మరోక్షణం తుంటరిగా..
ఎంత పిచ్చి మనసు నాది..
తోలి అడుగులలో తడబడినా,
మలీడుగులతో బలపడుతూ..
అదేపనిగా బాధ పదక
ఇదేపనిగా సాన పెడుతూ..
ఎంత పిచ్చి మనసు నాది..
నచ్చినది దొరకకపోయినా..
దొరికినది నచ్చకపోయినా..
దూరమైన హృదయాలను తలుచుకుంటూ..
భారమైన జ్ఞాపకాలని మోసుకుంటూ..
ఎంత పిచ్చి మనసు నాది...
శూన్యత నిండిన కన్నులతో..
భవితని మరచిన బాసలతో..
నిస్తేజంగా..నిర్వేదంగా
నిర్లిప్తంగా..నిరీక్షణగా
ఎంత పిచ్చింది నా మనసు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment