ఒరే కన్నా..హాయిగా బజ్జోరా..
ఏ చింతా లేకుండా నా గుండెల మీద
నిశ్చింతగా నిద్దురపో...!!
అలాగే నా గుండె చప్పుడు కూడా వినరా..
నేనూ.., నా అశయాలు...నీ కోసం కన్న కలలు..
అన్నీ నిశ్శబ్దంగా నా గుండె
నీతో చెప్పడానికి ప్రయత్నిస్తోందిరా..
వినపడుతోందా నీకు...???
నువ్వు నా కలల ప్రతిరూపానివిరా..
కాదు కాదు.. నువ్వు నా రూపానివే...!!
అవును మరి..నిన్ను చూస్తుంటే
నా ఈ పెద్దరికపు ముసుగులోంచి
నా బాల్యం లోకి తొంగి చూస్తున్నట్టుందిరా...!!
నా గుండెల మీద హాయిగా నిద్దురపోరా..
కానీ పెద్దయ్యాక మాత్రం నా గుండెల మీద తన్నకురా..
కేవలం ఇదొక్కటే..
నా (ప్రతి) రూపానికి నేను చేసుకునే మనవి..
No comments:
Post a Comment