అది ఒక సుందర నిర్మల సరోవరం
కమనీయ కలహంస సమాకలితం
ఆజలమధ్యమున
భువనమోహనుని ఆరాధనాలయం
కళ్హార హారవర్తనం /అది ఒక/
నాఊహలలో
ఆకరుణాంబుదిలో
తడిసితి మురిసితి
మరచితి లోకం /అది ఒక/
ఆ సుమతతిలో
నేనొకకుసుమమై
ఆదివ్యపదసీమలో
విరిసితి మురిసితి
మరచితి లోకం /అది ఒక/
ఆ అనంత కోటి కాంతులలో
నే నొక వెలుగు రేఖనై
మెరిసితి మురిసితి
మర్చితి లొకం /అది ఒక/
No comments:
Post a Comment