తీరాన్ని అపుడపుడు తాకే అలలు లాగ,
నీ తలపులు నా మది తలపులు తడుతూ ఉంటే,
చేతిలో నుండి ఇసుకరేణువులు జారిపోతున్నట్టుగా
తెలియకుండా కాలం కరిగిపోతోంది..
నీవు రావని తెలిసిన మరుక్షణమే
మనసు కరిగి కళ్ళనీరుగ ఉబికి వస్తోంది..
వసంతం కోసం ఎదురుచూసి చూసి
శిశిరాన అలసిపోయి నేలరాలిన ఆకులాగ
నేను కుడా ఏదోఒకరోజు ఈవాయువులో
కలసిపోయి కరిగిపోతాను..
అపుడుకుడా నీ శ్వాసగా మారి నీ
గుండెగూటిలో స్థానం కోసం ప్రయత్నిస్తాను..
శ్వాస పీల్చినపుడు ఉచ్చ్వ్హాశాన్నై నీ
గుండెగూటికి చేరుకుంటాను...అక్కడ
నా ప్రతిరూపాన్ని చూసుకుని తిరిగి
నీ నిశ్వాశాన్నై గాలిలో కలిసిపోతాను
No comments:
Post a Comment