Monday, 30 July 2012
అతను-ఏం చేస్తున్నావ్
అతను-ఏం చేస్తున్నావ్
ఆమె -నిశబ్ధానికి ఎన్ని సంకెల్లో లెక్క పెడుతున్నా
అతను-సంకెల్లన్నీ తొలిగిస్తూ నీతోనే ఉన్నాగా?
ఆమె-అలాగే అనుకున్నా కాని నువ్వు అర్ధంతరంగా నీకు తెలియకుండా నన్ను ఒదిలిపోయావ్
అతడు-అదేంటి నా గుండె సడి నిన్ను అంటిపెట్టుకొనే ఉందిగా
ఆమె- సడి మాత్రమే ఉంది సంబంధిగా కాదు ఇబ్బందిగా నన్ను నిందిస్తూ అనుకుంటా
అతడు-ఏమయ్యింది ?ఎందుకలా ?నీలో నుంచి నన్ను తోడేస్తున్నావ్?
ఆమె-తోడేయడం కాదు ఎంత నింపుకోవాలని చూసినా నాలో నువ్వు పూర్తిగా నిండటం లేదెందుకని ఆలోచిస్తున్నా
అతను-బంగారం యిదో నా శ్వాస తీసుకో శరీరాన్ని వదులుకోనైనా నీలో నీతో ఉండిపోతా..
అంటూ తనని గుండెకి హత్తుకున్నాడు ఆమె కన్నీటి సంతకాన్ని స్వీకరిస్తూ..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment