"..యుద్ధాన్ని ప్రేమించే వాళ్ళే
యోధులు
అసలైన సమయంలో
వెన్ను చూపే వాళ్ళు
ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోలేరు
చావు..పుట్టుకలు సహజమైన చోట
ప్రతి నిమిషమూ ప్రాణ ప్రదమే
ఆర్ధిక అసమానతలు ..
సామాజిక వివక్షలు
కులాలు ..వర్గాలు ..ఆధిపత్యాలు
అత్యంత అరుదుగా
మారిన సమయంలో
గొంతెత్తి మాట్లాడటం అంటే
స్వేఛ్చ కోసం ఆక్రోశించటమే..
అవును ..ఇప్పుడు యుద్ధాన్ని
హత్తుకునే వాళ్ళు కావాలి
దట్టించిన బందూకులై ..ఏ క్షణమైనా
కదన రంగంలోకి
ప్రవేశించే దమ్ముండాలి
అలాంటి వాళ్ళే
విజేతలుగా నిలుస్తారు
కోట్లాది మంది గుండెల్లో
నిలిచి పోతారు.."
No comments:
Post a Comment