Tuesday, 24 July 2012

గడిచిన కాలమే

గడిచిన కాలమే బాగుండేది పల్లెలోని స్వచ్చమైన వాతావరణం మమ్మల్ని మైమరిచిపోయేలా చేసేది గాలి రివ్వుమంటూ గుండెలను తాకేది అందరం వచ్చి వెళ్ళిపోయే మబ్బులను మనసు దోచే ఇంద్రధనస్సును చూస్తూ ఉండే వాళ్ళం వాన చినుకులు చేసే సవ్వడులను వింటూ గడిపే వాళ్ళం వాకిట్లో ముగ్గులు ..పెరట్లో పశువులు పిల్లల కేరింతలు లేగదూడల పరుగులు మమ్మల్నిఆనంద డోలికల్లో ముంచేసేవి .. మా ఇల్లు పొదరిల్లు నిత్యం బంధువులు.. స్నేహితులు..హితులు ..సన్నిహితులతో నిండి పోయేది.. ప్రతి రోజూ రాత్రి అయితే చాలు అందరం ఒక్కరం అయ్యేవాళ్ళం పిల్లాపాపలతో ఇల్లు కళకళలాడేది.. తోరణాల శబ్దం ఒక్కోసారి గుడి గంటలను మైమరిపించేది ఊరి పక్కన వాగు వాగు అంచున గుడి నిత్యం దీపం వెలిగేది ఉదయం ..సాయంత్రం అయితే ఆలయం చుట్టూ మూగేవాళ్ళం తీర్థం ..ప్రసాదం కోసం మా ఇంట్లో లక్ష్మి పుట్టింది మా ముందే పెరిగి పెద్దదైంది తను కన్నీళ్లను దిగమింగుకుని తను కరుగుతూ కుటుంబ పరువు కోసం .. తండ్రి పరువు కోసం భరించింది ..మానసికంగా ..శారీరకంగా అన్నిటిని భరించింది చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ..బతుకు పోరాటం చేస్తోంది .. మనుసులు ఒక్కటే .. కానీ వాళ్ళలో మ్రుగాళ్ళు ఉంటారని అర్థమైంది ఇప్పుడు ..గూడు కట్టుకున్న మా అందమైన పొదరిల్లు మాయమైంది ..మమ్మల్నివిడిచి వెళ్లి పోయింది (చావు నుంచి బయటపడ్డ చెల్లెలి కోసం )

No comments: