నీకు తెలిసిన నిన్నలో
నిజంగా నువ్వున్నావా?
నీకు తెలియని రేపులో
నువ్వంటూ ఉంటావా?
కలల్ని కంటూ
కలత పెంచుకుంటూ..
నీ సొంతమైన 'నేడూని
నువ్వు కోల్పోతున్నావుగా..
వెలితి చూపిస్తూ వెళ్ళిపోయే
ఒక్కో క్షణం ఓ గుణపాఠమే..
అయినా సరే తీరదేమిటో,
మనసుతో ఆడుకునే మనిషి ఆరాటమే..
పొందినవాటిని పట్టించుకోని మనిషెప్పుడూ
పోగొట్టుకున్నవాటిని లెక్కపెట్టుకుంటాడు..
అర్హతలేనివాటికి అశృవులు ధారపోస్తూ..
అక్కర్లేని జ్ఞాపకాలకి ఆయువు పొడిగిస్తుంటాడు..
No comments:
Post a Comment