Saturday, 21 July 2012

అలసి సొలసి నా సతి

అలసి సొలసి నా సతి నిదరోయిన ఘడియ నే తన హృది తెరచి చూడ గదినిండుగా ఏదో చిక్కటి రస సుడిలో ఎన్నెన్నో కాంతి రేఖలు నిండ నే నేత్రాలార్చి జూడ అదంతా ఒకానొక చిత్రాన్నుండి అది ఏదో కాదు నాదేనని నే ఠక్కున గ్రహించి అసలేదీ ఎరగనట్టు తిరిగన్నీ సర్దేసి చిక్కటి ఆనంద డోలికలూగ హాయిగా చీకు చింత లేక నిద్దర్లో కలలఖ్ఖరలేదని కనులు తెరచే కంటున్నా

No comments: