గుండెల్లో గందరగోళం, మనసులో మాయజాలం
దాహం లేదు,ఆకలి లేదు నువ్వెవరు.....??
నిద్రలో ఉలికింత, పగలే కలవరింత.......
ఇదివరకు ఎరుగని వింత నువ్వెవరు...??
చిరు చినుకుల జల్లుల్లొ సిరి వెన్నెల ఏటిలో,
మరు మల్...లెల వాగులో తేలుతున్న నువ్వెవరు...??
పారే సెలయేరు సాక్షిగా మరుగునున్న చెలిమికి
వలపు భారం మోస్తున్న నువ్వెవరు....??
గుప్పెడు గుండె చప్పుడులో.....
నీకై అనుక్షణం నా ఈ నిరీక్షణం...!!
మాయదారి చూపుల్లో నా తలపు
బంధించే నువ్వెవరు....నువ్వెవరు...??
ఓ..... ..ఊహ సుందరి.......
1 comment:
వెతుకు వెతుకు వెతుకు వెతుకు వెతుకు వెతుకు వెతుకు
ఏదో ఒక రోజు నీ ముందు ప్రత్యక్షం అవుతుంది
Post a Comment