"..కనురెప్ప మూసే లోపే
కలలన్నీ కల్లలవుతున్నవి
ఏమీ లేని చోట
ఏదో జరిగిపోతున్నట్టు
కల్మషం లేని హృదయాన్ని
కమ్ముకున్నట్టు
ఇంకా ఇంకా ప్రయాణం కొనసాగుతూనే ఉంది
ఇది ..నిరంతరమా లేక తాత్కాలికమా
అన్నది అర్థమయ్యేలోపు
కాలమూ జీవితమూ
కలగలిసి పరుగులు తీస్తున్నవి
మమ్మల్ని మైమరిచిపోయేలా
చేసిన ఆ జ్ఞాపకాల పాటలు లేవు
దుఖం లోంచి ..సమస్త ప్రపంచం లోంచి
బయటకు వచ్చేలా చేసిన ఆ సుమధుర
సుమనోహరమైన గాత్రం
చుట్టుముడుతోంది ...ఇప్పుడు
చీకట్లో గానాలు ఉండవా అన్న దానిపైనే
చర్చంతా ...అయినా ..
లోకాన్ని ఆవిష్కరించే గొప్పనైన సాధనం
గానమే .."
No comments:
Post a Comment