నిదురోతున్న ఆ అమ్మాయి ముఖంపైఎగురుతోంది ఒక ఆకుపచ్చనిసీతాకోకచిలుక-ఒక చల్లచల్లని
గాలి తాకిన నీరెండ నీడ. యిక నేను
తన చెంపపై రాలిన ఆ గడ్డిపరకను నెమ్మదిగా తొలగించి
పచ్చికపై సాయంత్రం వాలిన ఆ
వెన్నెలని చూస్తాను అబ్బురంగా
కొంత అసూయగా కొంత ప్రేమగా-
భగవంతుడా! తనలా అలా
ఒక కలలో చక్కగా చిన్నగా
నేను నిదురోగలిగితే ఎంత బావుండు!
గాలి తాకిన నీరెండ నీడ. యిక నేను
తన చెంపపై రాలిన ఆ గడ్డిపరకను నెమ్మదిగా తొలగించి
పచ్చికపై సాయంత్రం వాలిన ఆ
వెన్నెలని చూస్తాను అబ్బురంగా
కొంత అసూయగా కొంత ప్రేమగా-
భగవంతుడా! తనలా అలా
ఒక కలలో చక్కగా చిన్నగా
నేను నిదురోగలిగితే ఎంత బావుండు!
No comments:
Post a Comment