Friday, 13 July 2012

తలదించుకున్న


తలదించుకున్న ప్రతివాడూ
తప్పు చేసినట్టుకాదు...
తల ఎత్తుకున్న ప్రతివాడూ
తప్పు చేయనట్టుకాదు.. 
కాలం అనే ప్రవాహంలో
కొట్టుకుపోయే ప్రతి మనిషి వెనకా,
వెలుగు పరుచుకోలేనంత చీకటి ఉంటుంది...
ఆశ తోడున్న ప్రతి మనిషి ముందర
చీకటి కమ్మలేనంత వెలుగు ఉంటుంది.. 


గర్వించే గతమున్నోడికి
వర్తమానంలో గర్వభంగమయ్యే 
ప్రమాదం ఉంటుందేమో కానీ..
గాయం చేసిన / గాయపడ్డ గతమున్నోడికి..
వర్తమానంలో ఘన చరిత్ర రాసుకునే అవకాశం
మాత్రం కచ్చితంగా ఉంటుంది..