Sunday, 15 July 2012

కసురుకోకు



నీకు ఎక్కడైనా ఎన్నడైనా
దారి పక్కగా రాలిన ఓ
చిన్న పూవు కనపడితే

ఏ మలుపులోనైనా
దారి దాటేందుకు ఓ
అంధుడు భీతిల్లి అవస్థ పడుతుంటే

నిన్ను ఎన్నడైనా ఎక్కడైనా
మసిబారిన ఓ పసి బాలుడు
చికాకుపరిచేంతగా వెంటపడి
వేలాడబడి అడుక్కుంటుంటే

ఈ లోకాన్ని విసురుకోకు
మనుషులని కసురుకోకు -

ఎందుకంటే
అమ్మాయీ

వాళ్ళల్లో నేను
నాలో వాళ్ళూ
విధిలేక బేలగా దాగి ఉండొచ్చు-

No comments: