Monday, 2 July 2012

అల్లంత దురాన..





మబ్బు కమ్ముకున్న ప్రతిసారీ
నువ్వు నన్ను కప్పుకో...
వెచ్చని నీరై
నన్ను తడుముకో..
హిమ కౌగిలివై
చిగురాకు ముద్దువై
చిరు జల్లువై
చిరుగాలివై
ఎపుడు నాతోనే ఉండు..
నీకు అడ్డు కానీ...
అడిగే వారు కానీ లేరుగా...
మరెందుకు అల్లంత దురాన ఉంటావు...ఎపుడు ?? 

No comments: