వాన కురిసి వెలసినపుడు
మట్టి వాసన
పెరటిలోని తోటలోని
సంపెంగ వాసన
అల్లి బిల్లిగా అల్లుకున్న
విరజాజుల వాసన
పరిమళాలు వెదజల్లు
పారిజాతపు సువాసన
మనసుకు మత్తెకించు
మరువపు వాసన
నచ్చని చెలి ఉండునా ?
ఇన్ని సువాసనల మధ్య
ఒడిలో చేరిన చెలి కురుల
పరిమళాలు నచ్చని
చెలికాడు కలడా ?
No comments:
Post a Comment