పరువానికి పూల బాటలు
పరువానికి పూల బాటలు
వేసిన ప్రియతమా
మగువ మనసు నెరిగిన
కోర మీసపు మొనగాడా
యవ్వన సౌరభానికి ఆశలు
కల్పించిన చెలికాడా
చెలిమి కోసం చెలి చూపులు
చేసే సైగలు తెలియవా
ఎందుకో నాకీ విరహపు జ్వాల
తెలుపవా చిలిపి మగడా ??
వలపు తలపులు తలుపులు తట్టినవి
హృదయ ద్వారము నీకే తెరచి ఉంచితి
వేగ రావా వన్నెల చెలికాడా !!
No comments:
Post a Comment