బంధం
నాకు నేను ఏర్పరచుకున్న
బంధాలు ఎన్నో అనుబంధాలు ఎన్నెన్నో
జీవన ప్రయాణంలో మార్పులను
శాశ్వత ముద్రలుగా భావించను
మార్పు సహజం అనే సత్యాన్ని
తెలుపని దేదీ లేదు ప్రపంచంలో
ఆశల పంజరాన్ని చేదిన్చినపుడే
మనసు స్వేచ్చగా విహరిస్తుంది
పొందాలి అనుకొనే వాళ్ళకి చెందదు ప్రేమ
పంచాలి అనుకునే వల్లనే చేరుతుంది ప్రేమ !!
No comments:
Post a Comment