ఆ పెదవిపై విరిసే చిరునవ్వు కుసుమం
కనులలో మెరిసే లేతసోయగం
మనసులో ఉప్పొంగే సంతోషం
నడకలో కదిలే విశ్వాసం
చెప్పకనే చెబుతున్నది విషయం
నేటి విశేషం నీ జన్మదినం
నీ వెన్నంటే రావాలి విజయం
ఊయలూగాలి నీ ముంగిట ఆనందం
వెలిగిపోవాలి నీ జీవితం
ఆ వెలుగవ్వాలి అందరికి ఆదర్శం
ఓ నేస్తం నా ప్రియనేస్తం
అందుకో నా ఈ చిన్న కవితా బహుమానం!!
నరేష్
No comments:
Post a Comment