Tuesday, 8 May 2012

స్వాతిముత్యం




స్వాతిముత్యం నేనైతే నీ మెడలో ముత్యలహరమై మేరవనా???
సీతాకోక చిలుకను నేనైతే నీ ప్రేమతోనే నాపై రంగులద్దుకోనా ???
చిరునవ్వు నాదైతే ఆ నవ్వులో నీ పేరునే వెలుగుగా మలచనా???
గుండె మాత్రమే నాది.... గుండె లయ నీవేగా....
దేహం మాత్రమే నాది.... ప్రాణం పోసినది నీవేగా...
చంద్రునివై నా జీవితంలో వెన్నల జల్లులు కురిపిస్తా అంటే వద్దంటాన
అలుకైనా, కినుకైన, కసురుకున్న చిలిపి చనువైనా… మరేదైనా…
నీ దరికి చేరుకొనుటకు ప్రేమతో(లో) నే చేసిన అల్లరి చేష్టలే సఖా…
మనసుని బాధించా అనుకుంటే మన్నించు,
మనసైనదానను అనుకుంటే నీ మనసులో బంధించు
ఎల్లవేళలా వెన్నంటి నడిపే వీడని తోడై ఉంటానంటే కాదంటాన
ఇంద్రధనసుపై ఇల్లు కట్టుకుని నీకోసమే వేచి ఉండనా ప్రియా!!!  

No comments: