Friday, 4 May 2012

నువు కాదన్నా





నువు కాదన్నా నీ వెనకే 
నిలిచి ఉంటున్నది ..

తీరని కోరికలతో కాదు 
తీర్చలేని ఆశలతో కాదు 
తనివి తీరని వ్యామోహం తో కాదు 

అవధులు దాటిన అనురాగంతో
గుండెలు నిండిన అభిమానంతో
మనసులో ఉప్పొంగిన ప్రేమతో

నా కలలు చెదిరినా
నిను కంటికి రెప్పలా కాపాడుతా
నా ఊపిరి ఉన్నంత వరకు

జీవన సమరంలో
నిలిచి ఉంటా నీడగా వెన్నంటి
చివరి శ్వాస దాకా !!



                 నరేష్.

No comments: