ప్రేమ అనే పవిత్ర భావనలో
గెలుపు ఓటముల ఆలోచన
ఏ ఒకరి మనసులో వచ్చినా
ప్రేమించి, ప్రేమించ బడటంలో ఉన్న
అనిర్వచనీయమైన, అద్వితీయమైన
అమూల్యమైన సుమధుర భావనకు
స్పందించే మనసులు దూరం అయినట్లే
మాటల కందని మధుర భావన
రెండు మనసులు ఒకటిగా మారి
జంటగా అనుభూతి పొందే
ఉత్తమమైన మానసిక స్థితి ప్రేమ
ప్రేమ అన్న భావము
హృదయంలో ఉదయించి
మనసులో వికసిస్తే చాలు
అదే జీవితానికి వెలలేని బహుమతి ..
ఎందరికో అందదు ప్రయత్నించినా
కొందరికి అందినా నిలపుకోలేరు
ఎ కొద్దిమందికో అది అమృతంలా మారి
జీవన సాఫల్యం కలుగ చేస్తుంది !!
No comments:
Post a Comment