తాను నన్ను చూడనప్పుడు
తననే చూడాలనిపిస్తుంది
తాను నన్ను చూసినప్పుడు
నా చూపు ఎటో మరలుతుంది
తాను ముందర నడిస్తే
వెనుక నేను ఆనంద తాండవమే తాను వెనక వున్నప్పుడు
అడుగులు తడబడుతాయి
తాను మాటలాడనప్పుడు
అన్నీ అర్ధం అవుతాయి
తాను మాట్లాడితే..
మనసు మాటలు వినదు
తన సన్నిధిలో
మనసు స్వేచ్చగా విహరిస్తుంది
తాను తావున లేనపుడు
నిశ్చల తటాకంలా మారుతుంది
ఎన్నో గ్రంధాలలో లేని అనుభూతుల
సమూహం నా ప్రేమ కావ్యం ...
No comments:
Post a Comment