అర్ధరాత్రి కలవరం
అమ్మా...!
అంటూ... ఏడ్చే కన్నీటి చుక్క.
ఉల్లిక్కిపాటుతో..
తచ్చాడే చేతికి...
బెడ్ లాంప్ స్విచ్
మూత పెట్టబడిన నీళ్ళ గ్లాస్
తప్ప ఏమి కనిపించదు.
అవే నడి రాతిరి నా నేస్తాలు ...
గుక్క నీరు తాపి
గొంతు తాడార్పుతుంది గ్లాసు
ఉరికే భయపడ్డావ్
చూడు ఎవరూ...లేరంటుంది లాంప్.
ఎవరో తన నిద్రను చెడగొట్టినట్టు
ఏయ్ పడుకో...!
అంటూ..
కన్నీటిని విసుకుంటోంది నిశబ్దం.
ఇవేవీ పట్టించుకోకు.. పడుకో అంటూ..
దగ్గరగా... జరుగుతుంది దుప్పటి.
ఇదంతా... ఏంటి అంటే...?
పుట్టుకతోనే...
ఒంటరితనాన్ని తోడుగా..తెచ్చుకున్నవుగా...
అంటూ... వేకువలోకి జరుకోంది చీకటి !!
నరేష్.
No comments:
Post a Comment