Sunday, 6 May 2012

పుడమి మీద





పుడమి మీద 
ప్రతి రోజు 
పూసే పూవులు ఎన్నో 

నేల రాలిన పుష్పాలు 
కొన్ని

వాసన లేని విరులు
కొన్ని

ప్రత్యుత్పత్తి చేయు పూవులు
కొన్ని

సిగను అలంకరించు
కుసుమాలు కొన్ని

తరులు, లతల
విరిసిన కుసుమాలు
దిగులు చెందవు
వాటి గమ్యం కోసం..

ప్రకృతికి శోభ నిచ్చుటే
వాని కర్తవ్యం

అందుకే వాటి
జీవితాలు ధన్యము

ఫలితం ఆశించని ప్రయత్నం
గీత లోని సారంశం !!

No comments: