Wednesday, 16 May 2012

ఆకాశానికి





ఆకాశానికి నిచ్చెనలు 
వేసినా అందవు 

పాతాళానికి పరుగులు 
వద్దన్నా ఆగవు 

గతిలేని మధ్య తరగతి

ప్రేమల బంధాలలో
ఉపిరి పీలుస్తారు

పర్ణ కుటీరమే
విశాల భవంతి


నేటి ఆనందాన్ని
రేపటికి వాయిదా
వేసే వారు కొందరు

ఆనందాన్ని కుడా
పొదుపుగా అనుభవించే
వారు ఇంకొందరు

ప్రతిక్షణం తపనతో
పరుగులు తీస్తారు
తరగతి పెరగాలని

అలసి సొలసిన వ్రుధాప్యంలో
జీవన శైలి పెరిగినా
తరగని బాధ గుండెలలో
మిగిలిపోతున్నది..

పేగు బంధాలు
ప్రేమ పంచక
ఆస్థులు పంచుకొని
అనాధలుగా ఒదిలేస్తే .....

కుమిలి పోతున్న
మానవత్వం కన్నీరు పెడితే

అమృత మూర్తుల బాధలు
పెట్టని శాపాలుగా మారి
ఆవిరవుతున్నది
బిడ్డల ఆనందం
తర తరాలుగా కరుగుతున్న ఆస్థిలా !! 

No comments: