"ఈ నేల రాను రాను
విధ్వంసానికి గురవుతూ వస్తోంది
మనం పోయినా
అక్కున చేర్చుకునేది ఈ భూమే
మనం చీదరించుకున్నా ..నిర్లక్ష్యం చేసినా
హత్తుకునేది ఈ పుడమినే
ఒకప్పుడు నా నేల ఆకసంలా ..
పండు వెన్నెలంతా పర్చుకున్నట్టు
పరువం వానగా మారినట్టు
నదిగా ముద్దాడినట్టు
నిండు ముత్తైదువలా ఉండేది
కానీ ఇప్పుడు
భూమి కొలిమిలా మండుతోంది
గుండెపై సమ్మెట పోటు వేస్తోంది
చేతిలోకి తీసుకుందామంటే
మట్టి ముద్ద కూడా రావడం లేదు
కడుపు నింపే ఈ అందమైన నేల
తానే దుఖిస్తున్నది
పగుళ్ళు బారిపోయి
గుండెలను చీల్చుతోంది .."
No comments:
Post a Comment