నీ కోసం గడిపిన నిడురలేని రాత్రుల నడుగు
నీ కోసం నడచిన ఒంటరి బాటల వెంట చూడు
కరిగిన స్వప్నాలను కలిపిన ఆశ
చెదిరిన మనసును నిలిపిన తపన
నీ నిరీక్షణలో
నిర్లక్ష్యం చేసిన గతము
పసిడి వర్తమానాన్ని ఒడిసి
మసక బారిన భవితను
మిగిలించింది కానుకగా
మిగిలిన ఘడియలు లెక్కపెడుతూ
ఆగని ఊపిరి నిలుపుకుంటూ
వేచివున్నా నువు రాక పోతావా
నా కోసం రాకున్నా
జీవిత కాలం వేచివున్న
నేను నమ్మిన పిచ్చి ప్రేమ కోసం
వస్తావన్న ఆఖరి ఆశకు
నా శ్వాసతో ఉపిరిపోస్తూ
నిలిచి ఉన్నా నీ నిరీక్షణలో
కరుగుతున్న కొవ్వొత్తిలా !!
No comments:
Post a Comment