కాల చక్రాన్ని వెనక్కి తిప్పి
కౌమారం చివరకి వెళితే
ఎంత బాగుంటుంది..
యుక్త వయసులో
ఎన్ని భావాలో
ఎన్ని భావనలో
ఎన్ని స్పందనలో
ఎన్ని ఆలోచనలో
మాటకి మురిసి పోయా వొకసారి
చుస్తే పొంగి పోయా మరో సారి
తనువు తగిలితే విద్యుతరంగాలు
అణువణువునా ప్రవహిస్తే
నేను నేలపై ఉన్నదెపుడు
ఆకాసంలో విహరిస్తుంటే ప్రతి క్షణం
హద్దులు లేని ఆనందంలో
అందుకే కోరుకుంటున్న
నా మనసుని ఒకటే కోరిక
యవ్వనంలోనే ఉండమని
వయసు మళ్ళి పోఇనా !!
నరేష్.
No comments:
Post a Comment