నీ చేతిలో చేయి వేసి నడిస్తే
ఆ అండలో మనసు పొంగి
కొండంత గర్వముగా ఉండేది
నీ భుజములపై ఉన్నప్పుడు
ఆ ఆనందములో ఉప్పొంగి
లోకేమే మరచి పోయాను
నా అస్తిత్వానికే కారణ మైన నువ్వు
నాకైన చిన్న గాయానికే విల విల లాడితే
ఎన్ని సార్లు కనులు చేమరించినవో
అంతులేని నీ ప్రేమ పొందిన ఆనందంలో
కన్న మమకారానికో
నాన్న అన్న పిలుపుకో
అన్ని నీవై పెంచావు
ఉప్పొంగిన నీ ప్రేమ ముందు నా
అభిమానం ఎన్నడూ నిలవలేదు
అందుకే దోసిలితో కన్నీటిని నింపి
నీ పాదాలు కడగాలని చిన్న కోరిక
కొండంత నీ ప్రేమకు
గోరంత స్పందన
చెమ్మ గిల్లిన కనుల సాక్షిగా !!
నరేష్.
No comments:
Post a Comment