Tuesday, 16 October 2012

మరలా దొరకని నీ స్నేహం కోసం

నీ స్నేహం నేను ఎన్నడు అడుగలేదు నీ తోడు కావాలని నేను ఎప్పుడు కోరలేదు నేను ఊహించని నీ స్నేహం నాకు పంచావు నాకే తెలియకుండా నా తోడుగా నిలిచావు నిన్ను మర్చిపొమ్మని ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నావు నన్ను వీడి పోవడానికి నా అనుమతి ఎందుకు కోరుతున్నావు నువ్వు అల లా నన్ను కలిసి ఒక కల లా కరిగి పోయినా నువ్వు వదిలిన నీ జ్ఞాపకాలు నిన్నే గుర్తుచేస్తున్నాయి నేస్తం మరలా దొరకని నీ స్నేహం కోసం ఎదురు చూస్తోంది నా హృదయం

No comments: