Tuesday, 23 October 2012

బాల్యం బంగారు కాలం!

ఆ వయసులో ప్రతిదీ అద్భుతం! పండగొస్తే సంబరం! చుట్టాలోస్తే ఉత్సాహం! కొత్తబట్టలంటే తెగ ఆనందం! పిండివంటల మాట చెప్పక్కర్లేదు! ప్రతి గుడీ పిల్లలదే! హడావుడి మొత్తం వాళ్ళదే! ఒక పండగ వచ్చేందుకు నెల రోజుల ముందుగా.. ఎంత ఎదురుచూపు, ఎన్ని పథకాలు!! ఆటపాటల కోసం పెద్ద పెద్ద ప్రణాళికలు! ఊరు మొత్తం ఏకమై ఒక కుటుంబం లా , మారి సరదాలు చేసుకునే సందడి - పండగ! తిరునాళ్ళు జరిగేవి, బుట్టబొమ్మలు వచ్చేవి! వీధిభాగవతాలు సాగేవి! లోగిళ్ళనిండా ఆనందమే! ఇప్పుడా ఉత్షాహం కనుమరుగైంది!అంతా ఫార్మల్ గా మారింది! పిల్లలు పండగ రోజు..ను జస్ట్ హాలిడే అనుకుంటున్నారు! టి.వి చూస్తారు. వీడియో గేంస్ ఆడుకుంటారు! గుడి కెళ్ళండ్రా అంటే మనసులో దండం పెట్టేసామంటారు! పులిహోర, పాయసాలు బోర్! పిజ్జాలు, బర్గర్లు కావాలి! ఆడాళ్ళకి సీరియళ్ళు మిస్ ఐతాయి, అందుకే .. నైవేద్యాలు ఫ్రం స్వగృహ ఫుడ్స్! దేవుడు సర్దుకుపోతున్నాడు పాపం! గంటల తరబడి ఒక్కరు వండితే, అందరు తినడమేమిటని విప్లవం! నాగరికత మోసుకొచ్చిన కంఫర్ట్స్ చాటున ఆచారం అటకెక్కింది! ఎంత పెద్ద పండగైనా, ఓ పూట కి వచ్చిపోతోందంతే! సందడి, సంబరం లాంటివి ఆశించడం వృధాయేమో నేస్తం!

No comments: