Thursday, 18 October 2012
కన్నీటి భారతమా....కళ్ళు తుడుచుకో...!!
యుగాలెన్ని గడుస్తున్నా
నీ కంటి తడి అరనేలేదు...
నిలువునా తడుస్తున్నా
నీ వేదన తీరనే లేదు...
ప్రపంచపు మూల మూలల్లోకి
తెగపాకిన నీ ఘనకీర్తి....
స్వార్ధమనే రాకాసికి
చెరపబడుతుందని ఒక ఛలోక్తి...
దేశ పౌరులంతా నా
సోదర "సోదరీమణులే" అని
ప్రతిజ్ఞ చేసిన పురుషుల్లో
'చెల్లె' వరుసని "చెడిపిన"వారెంతమంది?
స్వార్ధపు విషపూరిత గాలుల్లో
రెపరెపలాడే నీ త్రివర్ణాల్లో లేని
ఎరుపురంగుని(రక్తాన్ని) చేర్చి,
తెలుపలేనంతగా తెలుపు లేకుండా చేస్తున్నారు నీ దుస్తుల్ని..!!
పంద్రాగస్టు పర్వదినమంటూ
తల ఎత్తి మరీ ఎన్ని ఎగతాళి చప్పట్లో...!!
ఎంత ఏడ్చినా ఏంటి ప్రయోజనం?
నీ కంటి తడి ఆరదిప్పట్లో....
పాలించే నాయకులెప్పుడో 'పోయారు'
మా దారిన మమ్మల్నొదిలేసి,
కన్నీటి భారతమా నువ్వేం చేస్తావ్ పాపం,
కళ్ళు తుడుచుకో... మాలా, ఆశలన్నిటినీ వదిలేసి...!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment