Thursday, 18 October 2012
ప్యార్ కి యాతో డర్ నా క్యా? జబ్ ప్యార్ కియాతో డర్ నా క్యా?
చాదస్తం కాకపోతే ఇప్పటి ప్రేమలకు భయమెక్కడిది?
అదేమిటో ఈ తరం లవ్వంతా పార్కులలో, సినిమా హాళ్ళలో,
ఫోన్స్ లో, ఈ మధ్య కాలం లో చాట్ చాటున సాగుతోంది!
వాటిని స్వీట్ నథింగ్స్ అనకూడదు, డిస్కషన్స్ అనాలి!
అప్పట్లో ప్రేమికులు నువ్వంటే నాకిష్టం, నువ్వే నా ప్రాణం,
అని ఎంతో ఇదిగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడదేమీ లేనట్టుంది!
నాకింత సాలరీ, నీకెంత? కటింగ్ ఎంత? ఓ విల్లా కొందాం..
నీ జీతం ఖర్చుకి, నా జీతం అప్పుకి కట్టుకుందాం అనుకుంటారు.
తమాషా గా ఉంది ఈ మార్పు, ఇది మంచికా చెడుకా కూడా తెలియడం లేదు!
ఇదివరకు అబ్బాయిలకి అమ్మాయిల అందం నచ్చి ప్రేమ పుట్టేది!
అమ్మాయిలకి అబ్బాయిల బుద్ధ్హి నచ్చి ప్రేమ పుట్టేది!
కానీ ఈ రోజుల్లో ప్రేమ కు మూలం యాటిట్యూడ్ అంటున్నారు.
ఆ గై యాటిట్యూడ్ బాగుంటుంది! ఆ గాళ్ ది భలే యాటిట్యూడ్..
వింటున్నాం ఇలాంటివంతా! ఒకరికొకరు మనసుపడేందుకు,
మనసు కాదు కారణం, పద్దతి! ఏం చెప్పాలో , ఏమిటో!
కులం గురించి ఆడిగితే కొట్టేలా లుక్ ఇస్తారు!
గుణం గురించి మాట్లాడే ఛాన్స్ ఇవ్వనే ఇవ్వరు!
తల్లిదండ్రుల వివరాలు అనవసరం, ముందువెనకలు అడగొద్దు!
పిల్లలు, పిల్లలు చూసేసుకుని ముహూర్తాలకు పెద్దలను పొమ్మంటున్నారు!
ఆ కొసరు గౌరవం మాత్రం ఎందుకు నేస్తం!? అవసరమా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment