Wednesday, 31 October 2012

వెన్నెల్లో విందుభోజనం!

వెన్నెల్లో విందుభోజనం! కొబ్బరాకుల నీడల పందిరి! పరుచుకున్న పున్నమి చాప! పైన నిండుజాబిల్లి దీపం! వాయులీనమైన వేణు గానం! గాలికి కదిలే మువ్వల అల్లరి! తడిగా మెరిసే ఆకుపచ్చ అరిటాకు! విచ్చుకున్న జాజి రెక్కల్లాంటి అన్నం! అమర్చిన అరవై నాలుగు అధవురులు! ఘుమఘుమల ఆహ్వానం! అమృతం లాంటి సూపు, అరమగ్గిన రుచికరమైన ఫలాలు! అన్నీ అమర్చిన వెండి పాత్రలు! ఆసనంగా ముఖ్మల్ తివాచీ! ఆ పక్క తాంబూలం పళ్ళెం అత్తరు గుబాళింపుల అగరుధూపం! ఎక్కడుందో స్వర్గం, చూసి వచ్చినవారు ఎవ్వరో!!అదంతా తెలియదు! కానీ ఇది మాత్రం కంటి ముందున్న వాస్తవం! కరగని స్వప్నం! అంతా నిజమే! భ్రమ కాదు, ఊహ కాదు, కల్పన కానే కాదు! ఆలస్యం ఎందుకు ఆరగించడానికి రమ్మంటున్నాయి అన్నీ! కానీ, అదేమిటో ఆకలి ఉండదు, ఆ తిండిలో రుచీ కనపడదు! తినకముందే వెగటు గా అనిపించే విందు! ఊపిరాడని సౌఖ్యం! అంత గొప్ప వైభవంలోనూ..నిట్టూర్పులు ఎగసిపడతాయి! తోడు లేని ఒంటరితనం గుండె ను కబళిస్తోంతుంది! ఎవ్వరూ లేరన్న దిగులు నిండిన మనసు కు ఎన్నున్నా ఏమున్నట్టు?! ఐశ్వర్యాన్ని కోరే కుబేరులు ఏకాకి బ్రతుకుల్ని ఏడుస్త్తూ మొయ్యల్సిందే నేస్తం!

No comments: