Thursday, 18 October 2012

ప్రేమ కూడా

యుద్ధం లాంటిదే నిజమైన ప్రేమికుడు కూడా ఓ గొప్ప యోధుడై ఉండాల్సిందే ఎవరు ఎన్ని చెప్పినా ఔనన్నా ..కాదన్నా ప్రేమ లేకుండా జీవించటం కష్టం మనిషితో మరో మనిషి సంభాషించాలన్నా కనీసం ప్రేమ అన్నది కలిగి ఉండాల్సిందే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితి ప్రేమ రెండు గుండెల్లో కదిలే రక్తపు స్పర్శ నీకు తోడుండేది నీతో పాటే వచ్చేది నిన్ను చెట్టులా వెంటాడేది నీ నీడనే.. చెలిమిలో రాగ ద్వేషాలు ఉంటాయి ప్రేమలో హృదయాలలో మమేకమై పోయిన అనుభవాలు ఉంటాయి.. నేను నీవు అన్న భావన వేరై ఒక్కటేనన్న ఆలోచన రెండు మనసులను కలిపేలా ఉంచుతుంది అందుకే ప్రేమించాలి కష్టాల్లో ఉన్నప్పుడు ..నిన్ను లోకం వెలి వేసినప్పుడు నీ వాళ్ళు నీ నుంచి దూరమై పోయినప్పుడు .. మనకి మనమే జవాబుదారి కావాలంటే ..ఒకే ఒక్క దారి అదే గోదావరి లాంటి ప్రేమ ప్రేమ నేరం కాదు ..ప్రేమించటం తప్పు కాదు ..ప్రేమ లేకుండా పోరాటం ఉండదు ..

No comments: