Tuesday, 23 October 2012

ఏం చేయను,

నేనూ కాలంలోనే వున్నాను... ప్రతి రోజూ కొద్దికొద్దిగా కరుగుతున్నాను! కాలాన్ని దాటాలంటే కడకు ఒకటే దారి అనీ, ప్రేమలో మునిగి, తేలి, ప్రేమనైపోవడమేననీ తెలుసు!! కాని నేను కాలానికి వీడుకోలు పలకను, పలికితే... లోలోన తిరిగి కలవాలనే భావన ఉండిపోతుంది. కాని ప్రేమా! కాలానికి మాత్రం నన్ను వదిలేయకు, నీవడిలో ఉంటే కాలం కూడా కొద్దికొద్దిగా కరిగిపోతుంది..! హద్దుల్లేని అకాశం కూడా ఒద్దికగా ఒడిలో ఒదిగిపోతుంది!!

No comments: