Wednesday, 31 October 2012

తెల్లని గులాబీ లా

తెల్లని గులాబీ లా స్వచ్చంగా ఉండాలని నవ్వుతూ నీతో జీవితం పంచుకోవాలని సంతోషంలో .భాదలో నీకై నేనుండాలని నీకు నేను గా నాకు నీవుగా ఉండాలని మనసులో.దాచుకొని చూసుకోవాలని మది అంతరంగంలో నిలచుకోవాలని ఎన్నీ కలలు కన్నాను అన్నీ నిజమనుకున్నాను మాటలన్నీ నిజాయితీ ఉందనుకున్నాను నాకోసమే నీవు పుట్టావనుకున్నాను నా కష్టాల్లో నీవు కోండత అండ అనుకున్నాను తుఫానుల ఇద్దరి మద్యా పెరిగించి దూరం ఎవరో పెట్టారు మనమద్యి వైరం.. కల్లలో పెట్టుకొని చూసుకున్న నాకు కళ్ళలో నీళ్ళు తెప్పించావు ఎర్రగులాబీ లాంటి మనస్సుకు అవమానం అనే రక్తపు మరకలంటించావు తెల్ల గులాబీ లాంటి మనస్సుకు.. అంటినీ రక్తపుమరకలు అనుకున్నా కాని గుండెళ్ళో గుచ్చుకుంటున్న జ్ఞాపకాల కత్తులకు కారుతున్న రక్తం అని గుర్తించలేకపోయా.. అదీ ఇప్పుడు నా ప్రానం తీస్తోంది నీవు కనికరించి ఒక్క పలకరింపుతో నైనా నన్ను ఓదారుస్తావని ఆశ ఇప్పుడు చచ్చి పోతోంది నీన్ను చేరాలనే ఆశ గుండేల్లోనుంచి రక్తంలా చిమ్ముతోంది అన్నీ నీకు తెల్సు. .. తెల్లని గులాబీ రక్తంతో ఎర్రగా మారినా చూసి కూడా చలనం లేకుండా వున్నావు.. అలా ఎలా ఉండగలుగుతున్నావు ఒకప్పుడు ఎంతో ప్రేమగా..జాలిగా.. నాకేం జరుగుతుందో అని కంగారు పడ్డ మనిషి.. ఇష్టపడ్డ మనిషి చనిపోబోతున్నా అంత నింపాదిగా ఉండటం అది నీకు మాత్రమే సాద్యిమేమో

No comments: