Tuesday, 16 October 2012

మన తియ్యని స్నేహానికి గురుతుగా

ఓ నేస్తమా నీ రూపం నా జ్ఞాపకాలలో పదిలంగా ఉంది నువ్వు అందించిన స్నేహం నా గుండెల్లో అందమైన ఊహగా మిగిలింది నిన్ను చేరి ఎన్నో ఊసులు చెప్పాలని నీ జాడ కోసం వెతికాను నువ్వు వదిలి వెళ్ళిన నీ స్నేహం తప్ప నీ ఆచూకి నాకూ దొరకలేదు అందుకే నా గుండెల్లో ఉన్ననీతో నా మనసులోని మాటలు పంచుకుంటున్నా నేస్తమా నా జీవిత పయనం లో నాకూ తోడుగా నిలిచింది నీ స్నేహమే నాతో నువ్వు లేకున్నా,నీ పేరు నా ఊహలోకి వచ్చిన మరుక్షణం లో నా పెదవుల పైన ఒక చిరునవ్వు నిలుస్తుంది మన తియ్యని స్నేహానికి గురుతుగా

No comments: