Tuesday, 16 October 2012

నీ చిరునవ్వే నా గమ్యం నేస్తం

ఓ నేస్తం... భారమైన నా హృదయానికి ఓదార్పు నీ స్నేహం అశాంతితో నిండిన నా మనసుకు ఆదరింపు నీ స్నేహం ఆవేదనతో రగులుతున్నప్పుడు ఓ చల్లని పలకరింత నీ స్నేహం ప్రవాహంలా జాలువారే నా కన్నీటికి ఓ అడ్డుకట్ట నీ స్నేహం అలసిన నా కన్నులలో కమ్మని కల నీ స్నేహం అస్తమిస్తున్న నా జీవితానికి వెలుగునుచూపిన సూర్య కిరణం నీవు అందుకే ఓ నేస్తం నీ చిరునవ్వే నా గమ్యం నా పెదవులపై ఈ దరహాసం విరిసిందీ నీ కోసమే.. కానీ నా నవ్వుకూ నీ నవ్వుకూ చిన్న తేడా ఉంది నేస్తం నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతావు నేను నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాను కమ్మని కలల్లా క్షణకాలమే మిగిలే ఈ జీవితంలో నాకు మిగిలిన ఒకే ఒక గుర్తువునీవు.... నన్ను మరు(విడు)వకు నా నేస్తం ఎన్నటికీ.... మిగిలిపోతా నీ స్నేహం అనే సముద్రంలో ఒక బిందువులా..............

No comments: