Tuesday, 16 October 2012

తర్వాతే నాకు అర్ధమైంది.....

రాయి కావాలంటే రత్నం ఇచ్చింది.. మట్టి ఇమ్మంటే మనసు ఇచ్చింది... మరేం చెయ్యలేక మనువాడాల్సి వచ్చింది... బూడిద కావాలి అంటే బంగారం తెచ్చింది... సున్నం వేపిద్దామా అంటే.. అన్నమా అని వడ్డించింది... చాలు చాలు అన్నాను చారా అని మరికాస్త వేసింది.. పప్పు అడిగితే పువ్వా అంటూ తేవడానికి వెళ్తోంది.. ఆగు అన్నాను... ఆకు కూడానా... సరే అనింది.. కాదు అన్నాను.. కాడతోనా... ఎందుకూ ? అని ప్రశ్నించింది.. కాదు కొమ్మ అన్నాను రెమ్మ తీసుకొనొచ్చింది... అంతలో పవర్ కట్ అయింది.. ఫ్యాన్ ఆగింది..దోమల కచేరీ మెదలైంది.. అదిగో దోమ అన్నాను... ప్రేమా.. ఇంతకీ ఎవరదీ ..? అంది.. తర్వాతే నాకు అర్ధమైంది..........

No comments: